వరంగల్ : కుట్రపూరితంగా కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని మాజీ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ అన్నారు. పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో హనుమకొండ చౌరస్తా వద్ద పటాకులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుట్రల కమిషన్ పై హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అన్నారు.
తెలంగాణను కోటి ఎకరాల మాగానిగా చేసేందుకు కేసీఆర్ ప్రపంచంలోనే గొప్పదైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారనే విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌ను రాజకీయంగా అభాసుపాలు చేయాలనుకున్న కాంగ్రెస్ కుట్రలు హైకోర్టు తీర్పుతో పటాపంచలు అయ్యాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పై వేసిన కమిషన్ అంతా ట్రాష్ అని గౌరవ హైకోర్టు తీర్పు సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.