మహబూబాబాద్, మే25 (నమస్తే తెలంగాణ) : మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ను ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న సత్యవతి సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను కేసీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించి, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అదించాలని సూచించారు. ఎలాంటి ఆందోళన చెందొద్దని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని, త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.