Fake Dentists | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 6 : నకిలీ దంత వైద్యుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణు యాదవ్ కోరారు. శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎండీఎస్‌లో ఇంప్లాంట్ లేదు కానీ చేశానని నకిలీ వైద్యులు బోర్డులు, ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని, పీజీ కోర్సుకు ఇంప్లాంట్స్ చేస్తామని నకిలీ వైద్యులు వస్తున్నారని ప్రజలు వారిని నమ్మి డబ్బులు వృథా చేసుకుని ఇబ్బందులు పడవద్దని సూచించారు.
కొందరు దంత వైద్యులు, దంత వైద్యం చేయడానికి అర్హతలేని నకిలీ డాక్టర్స్ వైద్యం పేరిట నకిలీ ఇంప్లాంట్స్, నాణ్యతలేని మెటీరియల్స్ వాడుతూ ప్రజలకు అనారోగ్యం కలిగించడం మా దృష్టికి వచ్చిందని, దంత వైద్యం పట్ల, ట్రీట్మెంట్స్ పట్ల ప్రజలలో అపోహలు సృష్టించడానికి కారణమవుతుందన్నారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రజా ఆరోగ్య సంరక్షణలో భాగంగా నకిలీ దంత వైద్యుల పట్ల జాగ్రత్త వహించాలని, క్వాలిటీ ఇంప్లాంట్స్, మెటీరియల్స్ వాడే వైద్యుల వద్ద మాత్రమే ట్రీట్మెంట్స్ పొందాలని తక్కువ ధరకు, ఉచిత చికిత్సకు ఆశపడి తమ సమయాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని ప్రజలను వారు హెచ్చరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మనురంజన్, వైద్యులు ఎం.జితేందర్, ఎం.రమేశ్‌బాబు, నవీన్, సంఘర్ష్, అభిలాష్, కూచన కిరణ్, శ్యాంసుందర్‌రెడ్డి, సాయిచరణ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Boy Accidentally Fires Air Gun | ప్రమాదవశాత్తు ఎయిర్ గన్ పేల్చిన బాలుడు.. అతడి అన్న మృతి
Siddaramaiah | కర్ణాటక సీఎం కారుపై చలానాలు.. డిస్కౌంట్లో కట్టిన సిబ్బంది
Vijayawada Utsav | విజయవాడలో క్రేజీ ఈవెంట్స్.. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సందడి..!