కాజీపేట, మార్చి 31: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్ 2న జరిగే ధర్నాకు కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బృందం ప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల నేతలు రైలులో సోమవారం వేరువేరుగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చీప్ కోఆర్డినేటర్ వీరస్వామి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ వేర్వేరుగా మాట్లాడుతూ బీసీలకు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ ను కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో బిల్లును ఆమోదించిందన్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ పెంపునకు సుప్రీంకోర్టు పరిధి నుండి మినహాయించి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్ల మెంటు సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో కొలిపాక ప్రకాష్, రాజ గోవింద్ ఉపేందర్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, దాడి మల్లయ్య యాదవ్, తమ్మల శోభారాణి బోనగాని యాదగిరి గౌడ్, భీమగాని యాదగిరి, దూలం సిద్దయ్య, వేణు, డేగల శ్రీనివాస్, చంద్రశేఖర్, మహేందర్, నాగరాజు, సరళ, ప్రమోద, సుగుణ తదితరులు ఉన్నారు.