Admissions | భీమదేవరపల్లి, జనవరి 28 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని ముల్కనూరు ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు 2026- 2027 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ మొదలైందని ప్రిన్సిపల్ ముజీబుర్ రెహమాన్ తెలిపారు. ఆన్ లైన్ ద్వారా ఆరవ తరగతి ప్రవేశాలతోపాటు, ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఆన్లైన్ దరఖాస్తు రుసుము, OC- రూ.200/-, BC/SC/ST/EWS -రూ.125/-కట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఏప్రిల్ 19న ఆరవ తరగతికి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుండి 12 గంటల వరకు, ఏడవ తరగతి నుంచి పదవ తరగతికి మధ్యాహ్నం 2నుంచి 4 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. దరఖాస్తు చేయుటకు website: https://tgms.telangana.gov.inలోకి వెళ్లాలని తెలిపారు. మరిన్ని వివరాలకు పాఠశాలలో
సంప్రదించాలని కోరారు.