వనపర్తి : గడిచిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల వారిని మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో సర్పంచ్, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్ల సమావేశంలో పాల్గొని మాట్లడారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు రుణమాఫీ, రైతుబంధు, బోనస్ వరి కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా పబ్బం గడుపుతోందన్నారు.
ఆడపిల్లలకు నెలకు 2500 స్కూటీలు తులంగా బంగారం ఏవి ఇవ్వకపోగా ఆడబిడ్డలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యకర్తలు మనోధైర్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరుగారింటీల పైన అన్ని సందర్భాల్లో పోరాడుతూ ధైర్యంగా ఉండాలన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లో అయినా సరే కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.