ఐనవోలు: ఎయిర్ కంప్రెసర్ ట్రాక్టర్( Tractor) వివాదం యువకుడు ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి వడ్డెర గూడెంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కక్కిరాలపల్లి వడ్డెర గూడెంకు చెందిన రాపోలు శోభన్ కుమార్, అదే గ్రామానికి చెందిన దాసు సాంబరాజు అనే వ్యక్తి దగ్గర శోభన్ కుమార్ గత కొన్ని నెలల క్రితం ఫైనాన్స్ అప్పు ఉన్న ఎయిర్ కంప్రెసర్ ట్రాక్టర్ ను కొనుగోలు చేశాడు.
సుమారుగా నాలుగు నెలల అప్పు కిస్తులు ఫైనాన్స్ కంపెనీకి శోభన్ కుమార్ చెల్లించాడు. కాగా బుధవారం మధ్యాహ్నం శోభన్ కుమార్ పురుగుల మందు తెచ్చుకుని వడ్డెర గూడెం బండ మీద ఎవరూ లేని నిర్మానుషమైన ప్రాంతానికి వెళ్లి తాను సాంబరాజు వల్ల పురుగుల మందు తాగుతున్నానని సెల్ఫీ వీడియో తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు శోభన్ కుమార్ ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఎంజీఎం లో చేర్చారు. శోభన్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.