Sankranthi Special Buses | హనుమకొండ చౌరస్తా, జనవరి 8 : సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ రీజియన్ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను తెలిపారు. ఈ నెల 9 నుంచి 13 వరకు వరకు హైదరాబాద్లోని ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి హనుమకొండ, వరంగల్ వైపు 650 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు, ఉప్పల్ వద్ద ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటారన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడ తాత్కాలిక బస్ షెల్టర్లు (టెంట్లు), తాగునీరు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం కోసం ఈ నెల 16 నుంచి 20 వరకు హనుమకొండ నుంచే కాకుండా నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూర్, జనగామ, పరకాల, భూపాలపల్లి బస్టాండ్ల నుంచి కూడా రద్దీని క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అదనపు బస్సులు నడపబడతాయని ఆర్ఎం విజయభాను తెలిపారు.
Tirupati Express | తిరుపతి ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం..మంటలను ఆర్పివేసిన సిబ్బంది
Mamata Banerjee | కోల్కతాలో ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడులు.. తీవ్రంగా ఖండించిన సీఎం మమత
Bomb Threats | ఏపీలో మూడు జిల్లాల కోర్టులకు బాంబు బెదిరింపులు