MLA Donthi Madhavareddy | వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్ తండాలో సబ్ స్టేషన్ నిర్మాణ స్థల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన స్థలం అంశంపై ఇప్పల్ తండా గిరిజన రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని అడ్డుకున్నారు.
ఇప్పల్ తండా శివారులోని ప్రభుత్వ భూమిలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు. సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంలో స్మశాన వాటిక ఉందని, భవిష్యత్లో స్థలం కోసం ఇబ్బందులు వస్తాయని గిరిజన రైతులు, బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్థలం విషయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు, గిరిజన రైతులపై కాంగ్రెస్ నేతలు, పోలీసులు దాడికి పాల్పడ్డారు. గిరిజన రైతులపై పోలీసులు, కాంగ్రెస్ నేతలు దాడి చేయడంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. ఈ ఘర్షణ నేపథ్యంలో ఇప్పల్ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎమ్మెల్యేను ప్రశ్నించిన గిరిజన రైతులపై కాంగ్రెస్ నేతలు, పోలీసులు దాడి
పలువురికి గాయాలు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్ తండాలో ఉద్రిక్తత
సబ్ స్టేషన్ నిర్మాణ స్థల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని అడ్డుకున్న గిరిజన రైతులు
దీంతో గిరిజనులపై దాడి చేసిన పోలీసులు,… pic.twitter.com/dzQx4piESx
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2026