కమలాపూర్ : మండలంలోని అంబాల గ్రామ శివారులో వ్యవసాయ కరెంటు మోటర్లు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ పంటలు పూర్తికావడంతో ఎస్సారెస్పీ కాల్వకు ఏర్పాటుచేసిన వ్యవసాయ మోటర్లను శనివారం రాత్రి దుండగులు మోటర్లను పగలగొట్టి కాపర్ వైర్ ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. సుమారు 15 కరెంటు మోటర్లు చోరీకి గురి కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరెంట్ మోటర్ల చోరీతో తీవ్రంగా నష్టపోయామని, వెంటనే దుండగులను గుర్తించి పట్టుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కరెంట్ మోటర్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Unwanted Hair | అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళలు.. ఈ చిట్కాలను పాటించాలి..!
Museum Day | దేశంలోని 3,698 చారిత్రక ప్రదేశాల్లోకి నేడు ఉచిత ప్రవేశం.. ఎందుకంటే..!