Museum Day : ఇవాళ (ఆదివారం) అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని (International Museum Day) పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అన్ని చారిత్రక ప్రదేశాలు (Historical places), మ్యూజియాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు భారత పురావస్తు సర్వే సంస్థ (ASI) ప్రకటించింది. దేశ చరిత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, చరిత్ర గొప్పదనాన్ని తెలియజేయడానికి దేశవ్యాప్తంగా అత్యంత విలువైన పురావస్తు కళాఖండాలు ఉన్న 52 మ్యూజియాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అంతేగాక వారి పరిధిలో ఉన్న 3,698 చారిత్రక ప్రదేశాల్లోనూ ఉచిత ప్రవేశ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశ రాజధానిలో ఉన్న తాజ్మహల్, ఎర్రకోట, తెలంగాణలోని చార్మినార్, గోల్కొండ, ఇటీవల వారణాసిలో ప్రారంభించిన మాన్ మహాన్ అబ్జర్వేటరీలోని వర్చువల్ ఎక్స్పీరియన్షియల్ మ్యూజియం లాంటి ప్రదేశాలను ఇవాళ ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చని అధికారులు తెలిపారు.