వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ గా సన్ ప్రీత్ సింగ్(Sunpreet Singh) నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 21 మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారిచేసింది. ఈ బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ కొత్త సీపీగా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సన్ ప్రీత్ సింగ్ నియామకమయ్యారు. సన్ ప్రీత్ సింగ్ 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవాడు.
2012 సంవత్సరంలో ములుగు ఏఎస్పీ, వరంగల్ రూరల్ ఓస్డీగా పని చేశారు. అనంతరం ఎల్.బి నగర్ డీసీపీగా, ఎస్పీగా జగిత్యాల్లో పనిచేశారు. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనర్ బదిలీ అయ్యారు.
ఇవి కూడా చదవండి..
Parrot | జైల్లో రామచిలుకను పెంచుకుంటున్న ఖైదీ.. ప్రశ్నించిన జైలు వార్డర్స్పై దాడి..!
Kiran Abbavaram | ‘దిల్రుబా’ సినిమాకు మీ ఎక్స్ లవర్‌తో వెళ్లండి : కిరణ్ అబ్బవరం
Orange Peels | నారింజ పండు తొక్కలతో ఇన్ని లాభాలు కలుగుతాయంటే.. ఆశ్చర్యపోతారు..!