Orange Peels | నారింజ పండ్లను తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నారింజ పండ్లను తింటే శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా చూస్తాయి. నారింజ పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే నారింజ పండ్లే కాదు వీటి తొక్క కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇకపై మీరు ఎప్పుడు నారింజ పండ్లను తిన్నా తొక్కను పడేయకండి. దాంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
నారింజ పండు కన్నా దాని తొక్కలోనే విటమిన్ సి అధికంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పండ్ల తొక్కను వేసి తయారు చేసిన నీళ్లను తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నారింజ పండు తొక్కలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. మలబద్దకం రాకుండా చూస్తుంది. జీర్ణాశయం, పేగులను ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో పొట్టలో కలిగే అసౌకర్యం తగ్గుతుంది. అలాగే జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను రాకుండా చూస్తుంది.
అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి నారింజ పండు తొక్కలు ఎంతో మేలు చేస్తాయి. ఈ తొక్కలను వేసి మరిగించిన నీళ్లను తాగుతుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదని విచారించే వారు ఒక్కసారి ఈ చిట్కాను ప్రయత్నించి చూడండి. కచ్చితంగా బరువు తగ్గుతారు. నారింజ పండు తొక్కలు అరోమా థెరపీగా కూడా పనిచేస్తాయి. ఈ తొక్కలను వాసన పీలుస్తుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట వీటి వాసనను పీలిస్తే మైండ్ రిలాక్స్ అయి నిద్ర త్వరగా పడుతుంది. గాఢ నిద్రలోకి జారుకుండారు. నిద్రలేమి తగ్గుతుంది.
నారింజ పండు తొక్కలతో మన ఇంటిని సైతం శుభ్రం చేసుకోవచ్చు. ఈ తొక్కలను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసి రసం తీయాలి. అందులో కాస్త వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని బాటిల్లో పోసి స్ప్రే చేస్తుంటే ఎలాంటి మరకలు అయినా సరే పోతాయి. ముఖ్యంగా కిచెన్ బండపై పడిన మరకలను ఇలా సులభంగా వదలగొట్టవచ్చు. సింక్ మీద ఈ స్ప్రే చేస్తుంటే దుర్వాసన రాకుండా ఉంటుంది. నారింజ పండు తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లలో కాస్త తేనె కలిపి తాగవచ్చు. ఇది మీరు రోజూ తాగే టీ లేదా కాఫీకి చక్కని ప్రత్యామ్నాయం అవుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ పండు తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసి కూడా ఉపయోగించవచ్చు. ఇలా ఈ తొక్కలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.