Collector Pravinya | దామెర : మండలంలోని ల్యాదెళ్లలో మహిళల ఆర్థికాభివృద్ది కోసం, చిన్న తరహా పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ల్యాదెళ్లలో నిర్మించిన భవనాలను ఇవాళ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల కోసం కుటీర పరిశ్రమల ఏర్పాటులో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అందులో భాగంగానే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కంప్యూటర్, మిల్లెట్స్, పిండి వంటల ఎగుమతులు, ఇతర కుటీర పరిశ్రమల కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!