హనుమకొండ చౌరస్తా, మే 14: వరంగల్ నగరానికి అందాల భామలు విచ్చేస్తున్న సందర్భంగా పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ 4వ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ కంజర్ల మనోజ్ కుమార్ ను హనుమకొండ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ సుందరీమణుల అందాల పోటీలు నిర్వహించడం వలన తెలంగాణ రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదన్నారు. 420 హామీలు ఇచ్చి గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
Heroine | ఆ హీరోయిన్ దగ్గర జాబ్ చేసే ఛాన్స్.. క్వాలిఫికేషన్స్ ఇవే..!
Donald Trump | సీజ్‌ఫైర్‌కు ఎలా ఒప్పించానంటే?.. భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్