Heroine | నిరుద్యోగులకి జాబ్ దొరికింది అంటే ఆ ఆనందమే వేరు. ఇక హీరోయిన్ దగ్గర జాబ్ చేసే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేయాల్సిందే. మరి ఆ అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటారు. మల్లేశం సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల ప్లే బ్యాక్ అనే సినిమాతో సక్సెస్ సాధించింది. ఇక వకీల్ సాబ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతి సినిమతో తన మార్క్ సెట్ చేస్తున్న అనన్య నాగళ్ల సిల్వర్ స్క్రీన్ మీద నటిగా పేరు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో మెప్పిస్తుంటుంది. ఉన్నత చదువులు అభ్యసించి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అయితే మొదట షార్ట్ ఫిల్మ్స్ చేసి ఆ తర్వాత హీరోయిన్గా మారింది.
అనన్య నాగళ్ల ప్లే బ్యాక్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా , సెకెండ్ ఫీమెల్ లీడ్ రోల్స్ నటించి ప్రేక్షకులని మెప్పించింది. మధ్య మధ్యలో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. అయితే అనన్య నాగళ్లకి సేవా భావం చాలా ఉంది. విపత్తు వచ్చినప్పుడు, ఎవరైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన వంతు సాయం చేస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు తనకు తోచినంత విరాళం అందించింది. అలానే హైదరాబాద్ నగరంలో రాత్రిళ్లు రోడ్లపైనే నిద్రించే పేదలు, అనాథలకు దుప్పట్లు పంపిణీ చేసి అందరి మనసులు గెలుచుకుంది.
ఇక పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన నెల్లూరు జిల్లాకు చెందిన మధు సూదన రావు కుటుంబాన్ని పరామర్శించింది అనన్య. తనకు తోచినంత సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్ స్టా స్టోరీస్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. ‘ ఫ్యాషన్ డిజైనర్ కోసం వెతుకుతున్నాను. 0-6 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైన సరే.. దయచేసి మీ రెజ్యూమ్‌ను CAREERS@MAYNAO.IN కు పంపండి. దయచేసి DM చేయవద్దు’ అని అందులో పేర్కొంది. మొత్తానికి అనన్య ఫ్యాషన్ డిజైనర్స్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మరి.