Death | ములుగు : ప్రమాదవశాత్తు బావిలో పడ్డ లేగదూడను రక్షించే క్రమంలో తండ్రీ కొడుకులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.
తండ్రీకొడుకులైన రస్పుత్ రాజు, పవన్ కర్లపల్లి గ్రామంలోని సుమారు 35 అడుగుల లోతైన బావిలో లేగదూడ పడిపోవడంతో దానిని కాపాడేందుకు ఆ బావిలోకి దిగారు. అయితే ఇద్దరూ ఒకే తాడుతో బావిలోకి దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాడు ఒక్కసారిగా తెగిపోవడంతో ఇద్దరు బావిలో పడిపోయి నీటిలో చిక్కుకున్నారు. గోవిందరావుపేట సీఐ దయాకర్, ఎస్సై తాజుద్దీనులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రస్పుత్ రాజు మృతదేహాన్ని బయటకు తీశారు.
పవన్ మృతదేహం కోసం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు. తండ్రీకొడుకులు గొప్ప మనుసుతో ఓ మూగజీవిని రక్షించాలనుకుని ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Ravi Teja | ఫుల్ స్వింగ్లో రవితేజ ‘ఇరుముడి’.. షూటింగ్ చివరి దశకు చేరిన మాస్ మహారాజ మూవీ!