కాకతీయ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులకు చివరి అవకాశం
హనుమకొండ చౌరస్తా, జూలై 29: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్ణీత కాలవ్యవధిలో కోర్సు పూర్తి చేయలేక బ్యాక్‌లాగ్‌లు మిగిలిన యూజీ, పీజీ పూర్వవిద్యార్థులకు 2026-2027 విద్యాసంవత్సరానికి చివరి అవకాశం కల్పిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 29: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్ణీత కాలవ్యవధిలో కోర్సు పూర్తి చేయలేక బ్యాక్‌లాగ్‌లు మిగిలిన యూజీ, పీజీ పూర్వ విద్యార్థులకు 2026-2027 విద్యాసంవత్సరానికి చివరి అవకాశం కల్పిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు. అర్హులైన విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్, ప్రాజెక్ట్ వర్క్, సెమినార్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని తమ కోర్సును పూర్తి చేసుకోవచ్చన్నారు.
ఇందుకోసం రిజిస్ట్రార్ అనుమతితో పాటు నిర్దేశిత రుసుములు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. యూజీ, పీజీ విద్యార్థులు ప్రస్తుత బ్యాచ్‌లతో కలిసి పరీక్షలు రాయవచ్చని, పీజీ విద్యార్థులు అవసరమైతే ఎస్డీఎల్సీఈ పరీక్షలతో పాటు ప్రత్యేక అనుమతి పొంది నిర్ణీత రుసుం చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని అర్హులైన పూర్వవిద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం www.kakatiya.ac.in ను సందర్శించవచ్చని తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

