Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ ఉంటే టీ ఎలా తాగాలి?
గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మారిన మన జీవన విధానమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే గ్రేడ్ 1 ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ దశలో ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మారిన మన జీవన విధానమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే గ్రేడ్ 1 ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ దశలో ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజూ తాగే టీ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరమని, ఫ్యాటీ లివర్ ఉన్నవారు టీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీలో ఉపయోగించే చక్కెర, పాలు వంటి పదార్థాలు కాలేయంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున టీ తయారీలో కొన్ని మార్పులు చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు.
టీ ఆకులు మాత్రమే కారణమా..?
టీ ఆకుల్లో సహజంగా ఉండే పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కాలేయ కణాలను ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అందువల్ల టీ ఆకులు మాత్రమే ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణం కావని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే టీని ఎక్కువగా చక్కెరతో తయారు చేసి తాగడం సమస్యగా మారుతుంది. ముఖ్యంగా తెల్ల చక్కెర, బ్రౌన్ షుగర్, కండెన్స్డ్ మిల్క్ వంటి వాటిని అధికంగా ఉపయోగించడం వల్ల శరీరానికి ఎక్కువ చక్కెర అందుతుంది. అందులోని ఫ్రక్టోజ్‌ను కాలేయం ప్రాసెస్ చేసే సమయంలో అదనపు కొవ్వుగా మార్చే ప్రక్రియ జరుగుతుంది. దీంతో కాలేయ కణాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది.
మార్పులు అవసరం..
అందుకే గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ ఉన్నవారు టీ తయారీలో కొన్ని సులభమైన మార్పులు చేసుకోవాలి. తెల్ల చక్కెర, బ్రౌన్ షుగర్, కండెన్స్డ్ మిల్క్‌ను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం మంచిదని సూచించారు. తీపి కావాలనుకునేవారు స్టీవియా లేదా మాంక్ ఫ్రూట్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చని తెలిపారు. అలాగే అల్లం, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించి రుచిని పెంచుకోవచ్చు. పూర్తి కొవ్వు ఉన్న పాలకు బదులుగా స్కిమ్డ్ లేదా తక్కువ కొవ్వు పాలు, చక్కెర లేని బాదం, సోయా లేదా ఓట్స్ పాలను ఉపయోగించాలి.
ఎలా తయారు చేయాలి..
టీ తయారీలో కూడా కొంత మార్పు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన పానీయంగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. ముందుగా మరిగే నీటిలో టీ ఆకులు, సుగంధ ద్రవ్యాలను వేసి వాటి సహజ గుణాలను వెలికితీసిన తర్వాత చివర్లో కొద్దిగా పాలు కలపవచ్చు. పాలు, చక్కెరను ఎక్కువగా వేసి టీని ఎక్కువసేపు మరిగించకుండా ఉండడం మంచిదని పేర్కొన్నారు. ఇలా టీ తాగే విధానంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ ఉన్నవారు తమకు ఇష్టమైన టీని పూర్తిగా వదులుకోకుండా ఆహార నియమాలను పాటించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

