IndiGo Flight Returns | ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. లండన్లో తిరిగి ల్యాండింగ్
IndiGo Flight Returns | ఇండిగో విమానం గాలిలో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో గంట ప్రయాణం తర్వాత ఆ విమానం వెనక్కి మళ్లింది. లండన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
న్యూఢిల్లీ: ఇండిగో విమానం గాలిలో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో గంట ప్రయాణం తర్వాత ఆ విమానం వెనక్కి మళ్లింది. లండన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. (IndiGo Flight Returns) బుధవారం తెల్లవారుజామున 12.40 గంటలకు ఇండిగోకు చెందిన 6ఈ4 విమానం లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది.
కాగా, సుమారు గంట సమయం గాలిలో ప్రయాణించిన తర్వాత బోయింగ్ 787-9 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. దీంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆ ఇండిగో ఫ్లైట్ లండన్లోని హీత్రూ ఎయిర్పోర్ట్లో తిరిగి ల్యాండ్ అయ్యింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్24.కామ్ వెబ్సైట్ ఈమేరకు నిర్ధారించింది.
అయితే ఇండిగో సంస్థ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆ విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య ఏమిటి? అందులో ఎంత మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు? అన్న వివరాలు తెలియలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

