Sabitha Indra reddy | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 17 సంవత్సరాల బాలికకు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఆల్కహాల్ తాగించి అత్యాచారం చేయించడంతో పేట్బషీరాబాద్లో కేసు నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో మొదటి స్థానంలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మొదటి స్థానంలో నిలిచింది.
అలాంటి పోలీసులు ఈ రోజు దేశంలోనే వెనకడుగు వేస్తున్న రాష్ట్రంలో తెలంగాన ఉందంటే బాధ అనిపిస్తుంది. ఆందోళన కూడా కనిపిస్తుంది.. ప్రభుత్వాలు మారుతుంటాయి. దాంతోపాటు ప్రాధాన్యాతలు కూడా మారుతాయి. కానీ ప్రాథమిక బాధ్యత అయిన శాంతిభద్రతలు విస్మరిస్తే రాష్ట్రమే అధోగతి పాలవుతుందని అనడానికి ఈ రెండున్నర సంవత్సరాలు ఉదాహరణన్నారు.. మన రాష్ట్రంలో శాంతి భద్రతలు అనగానే రాజకీయ వేధింపులు, ప్రతిపక్షంలో ఉన్నవారిని ట్రాప్ చేయడం తప్పితే ఏం జరగుతుంది రాష్ట్రంలో అనేదానిపై రివ్యూ చేసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. తెలంగాణ సాధించుకున్నమంటే ఏదో భౌగోళికంగా సాధించుకున్నది కాదు. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి.. పెట్టుబడులు వెల్లువలా రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ ఉపాధి దొరకాలినే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నం.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వానికి ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా హోంమంత్రి దగ్గరకు పరెగెత్తేవాళ్లు. రాష్ట్రంలో హోంమంత్రి లేరు. ఎందుకంటే ముఖ్యమంత్రే హోం మంత్రి. కానీ ఒక్కోసారి ఆ బాధ్యతను విస్మరించాలరేమో అనిపిస్తుంటుంది. ఎప్పుడు వెళ్లినా ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో సమీక్ష చేస్తున్నారని ఎప్పుడూ వింటుంటాం. ఏం సమీక్ష చేస్తున్నారని.. అనుకుంటే ఒక హోంశాఖ తప్ప మిగితా అన్ని సమీక్షలు జరుగుతంటాయి. కానీ కమాండ్ కంట్రోల్లో కూర్చొని హోంశాఖను సమీక్షించాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదని చెప్పుకోవాల్సి రావడం బాధాకరమైన విషయమన్నారు.
కేంద్రమంత్రి కొడుకా.. వేరే వ్యక్తి కొడుకా అని కాదు.. తప్పు చేసినప్పుడు సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయనకు కూడా అదేచట్టం ఉండాలే. ఎవరైతే కంప్లైయింట్ ఇచ్చిర్రో దాన్ని రిసీవ్ చేసుకోవాలె. కచ్చితంగా పోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే రిపోర్ట్ తీసుకుంటే ఆ అమ్మాయి 17 ఏండ్లు అని విన్నా. కాబట్టి పెట్టాల్సిందే. కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందన్నారు.
తప్పు చేస్తే కేంద్ర మంత్రి కొడుకుకైనా సామాన్యుడి లాగా శిక్ష విధించాలి
పోక్సో కేసు నమోదు చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిందే
బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి https://t.co/MTFSdLlIUY pic.twitter.com/6OFkLFhBu9
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2026