Bodrayi | ఏటూరు నాగారం, జూన్ 14: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శనివారం బొడ్రాయి 13వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టించి 13 సంవత్సరాలు కావస్తున్నా నేపథ్యంలో వేడుకలను చేపట్టారు.
వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉదయాన్నే బొడ్రాయి వద్ద ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం ప్రధాన అర్చకులు ఎల్లాప్రగడ రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో సహస్ర ఘటాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించి వార్షికోత్సవ పూజలను నిర్వహించారు. గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని పంటలు సమృద్ధిగా పండేందుకు ఆశీర్వదించు తల్లి అంటూ పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో బొడ్రాయి కమిటీ అధ్యక్షుడు పోగుల లక్ష్మీనారాయణ, సభ్యులు నిర్వాహకులు కత్తెర శ్రీనివాస్ నూతి రమేశ్, వేణుగోపాల్, లాహుటి మనోహర్, బచ్చు సత్యనారాయణ కుమార్, రామాలయం కమిటీ చైర్మన్ అల్వాల శ్రీనివాస్, శివాలయం కమిటీ చైర్మన్ మడుగురి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.