ఇనుగుర్తి,మే13: సృష్టిలో తల్లిని మించిన దైవం ఏదీ లేదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. నవమాసాలు మోసి కనిపించిన తల్లి ప్రేమ ముందు ఏది సాటి రాదన్నారు. మంగళవారం రవిచంద్ర తల్లి వెంకట నరసమ్మ 11వ వర్ధంతిని ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేక పూజలు చేసి నిర్వహించారు. అనంతరం ఆయన తల్లిదండ్రులు నారాయణ, వెంకట నరసమ్మ విగ్రహాలకు వారి పేరిట ఏర్పాటు చేసిన శృతి వనంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తో పాటు ఆయన సోదరులు వద్దిరాజు కిషన్, వద్దిరాజు దేవేందర్, వద్దిరాజు వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.