సంగారెడ్డి, మే 13 : స్థానిక ప్రభుత్వ అతిథిగృహం, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు సిగ్నల్స్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు తొలగి రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ఎస్పీ ఆధ్వర్యంలో సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రద్దీని అధిగమించి ప్రజలు, వాహనదారులకు సురక్షిత ప్రయాణం కోసం పట్టణంలోని ప్రభుత్వ ఐబీ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా ప్రధానకూడళ్లలో ఆధునిక సాంకేతికతతో ట్రాఫిక్ సిగ్నల్సను ఏర్పాటు చేశామన్నారు.
వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించి, సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తే జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ వల్లూరి క్రాంతి, డీఎస్పీ సత్తయ్యగౌడ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్, పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్‌తో పోలీసు అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.