kalvasrirampoor | కాల్వ శ్రీరాంపూర్, మే 13 : కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల శివాలయంలో మంగళవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా రమణీయంగా కనుల పండువగా జరిగింది. స్వామివార్లకు మహిళలు సారే చీర ఒడిబియ్యం నైవేద్యాలు సమర్పించారు.
కల్యాణ మహోత్సవంలో భక్తులు కట్న కానుకలు సమర్పించుకున్నారు. అర్చక పూజారి సాంబమూర్తి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అటికం శంకర్ , దాసరి లావణ్య, మాజీ ఎంపీటీసీ రావి సదానందం, వివిధ గ్రామాల భక్తులు మహిళలు పాల్గొన్నారు.