Mother | వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన మూడేళ్ల కొడుకును చున్నీతో ముడేసుకుని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పరిధిలో వెలుగుచూసింది.
కళ్యాణి(24) అనే వివాహిత తన కొడుకు శ్రేయాన్ష్(3)తో సహా ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లీకొడుకు కాలువలోకి దూకిన సమయంలో అందులో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. సమాచారమందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో చాలా సమయం పట్టింది. అధికారులు దాదాపు 7 గంటలు గాలింపు చర్యలు చేపట్టి తల్లీకొడుకు మృతదేహాలను వెలికి తీశారు.
కళ్యాణి పెదవులను చేపలు పూర్తిగా తినేసినట్లు గుర్తించారు. వరకట్న వేధింపులే ఈ దారుణానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Chennur | చెన్నూరులో దారుణం..టీచర్ల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య?
Pakistani ships | ‘హర్మూజ్’ గుండా 20 పాక్ నౌకలకు అనుమతి.. శాంతికి సంకేతమన్న పాకిస్థాన్
Anakapalli Teaser | త్రిణాధరావు నక్కిన మార్క్ స్టోరీతో ‘అనకాపల్లి’.. ఆకట్టుకుంటున్న టీజర్