CP Amber Kishore Jha | బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి : సీపీ అంబర్ కిశోర్ ఝా
CP Amber Kishore Jha | బాధితుల ఫిర్యాదుపై వేగంగా స్పందించి పారదర్శక విచారణ ద్వారా సత్వర న్యాయం ( Justice) అందేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు.
తాండూర్ : బాధితుల ఫిర్యాదుపై వేగంగా స్పందించి పారదర్శక విచారణ ద్వారా సత్వర న్యాయం ( Justice) అందేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ( CP Amber Kishore Jha ) పోలీసు అధికారులను ఆదేశించారు. తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తో కలిసి శుక్రవారం తనిఖీ నిర్వహించారు. కార్యాలయ పనితీరు, రికార్డుల నిర్వహణ, పోలీసు సేవల అమలును సమీక్షించారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీస్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతను పాటిస్తూ ప్రజలకు అనుకూల వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించి వారి సమస్యలను వినాలని అన్నారు. క్రింది స్థాయి అధికారులకు కూడా ప్రజలకు సకాలంలో సహాయం అందించేలా మార్గనిర్దేశం చేయాలని చెప్పారు.
స్థానిక రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు తమ సాంకేతిక నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సీఐ దేవయ్య, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

