Khammam Victim | ఇందిరమ్మ ఇల్లొచ్చిందని వాళ్లే కట్టుకోమన్నరు.. ఇప్పుడు వాళ్లే కూల్చేశారు.. శ్రీనివాస్ నగర్ బాధితురాలు
Khammam Victim | మా ఇల్లును సగం లేపాం.. మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు ప్రభుత్వ అధికారులొచ్చి కూలగొట్టారు. ఎంత ఏడ్చినా, ఆపినా కూలగొట్టడం ఆపలేదని ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో ఓ బాధిత మహిళ కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది.
Khammam Victim | కాంగ్రెస్ సర్కార్ ఖమ్మం శ్రీనివాసనగర్‌లో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తూ భయాందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. తమకు మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బాధితులు రోడ్డుపై ధర్నాకు కూడా దిగారు. ఇల్లు కట్టుకోమని చెప్పిన ప్రభుత్వమే తమ ఇల్లును కూల్చేస్తుందని ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో ఓ బాధిత మహిళ కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది.
సదరు మహిళ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్లు కింద రూ.5 లక్షలు లోన్ ఇస్తామన్నరు. అంటే మా రేకుల ఇల్లును కూలగొట్టుకున్నం. ఆ తర్వాత మా ఇల్లుకు లోన్ ఇస్తామని చెబితే మేము బంగారం తాకట్టు పెట్టి రూ.3.5 లక్షలు అప్పు తెచ్చుకుని ఇల్లు మొదలుపెట్టుకున్నం. అటు తర్వాత మాకు లక్ష రూపాయలు లోన్ వేశారు. అది కూడా కాళ్లరిగేలా తిరిగితే వేశారు. మా ఇల్లును సగం లేపాం.. మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు ప్రభుత్వ అధికారులొచ్చి కూలగొట్టారు. ఎంత ఏడ్చినా, ఆపినా కూలగొట్టడం ఆపలేదు. వాళ్లే కట్టుకోమన్నరు.. ఇక్కడ బోరు కూడా వేసుకున్నం.. ఇప్పుడు వాళ్లే మా ఇల్లు కూలగొట్టారు. మేము కమిషనర్ దగ్గరకు, కలెక్టర్ దగ్గరకు తిరిగాం. ప్రతీ సారి కూడా ఏం లేదమ్మా.. మేం మాట్లాడతాం.. మీరు వెల్లండి అని చెప్పిర్రు. ఇప్పటివరకు రూ.3.5 లక్షలు అప్పు తెచ్చి రూ. 3 వడ్డీ కడుతున్నాము. ఉన్న ఇల్లు కూల్చినందుకు ఇంకో ఇంటికి రూ.5000 కిరాయి కడుతున్నాము. మా బతుకు ఆగం చేశారు.. మాకు న్యాయం చేయండని విజ్ఞప్తి చేసింది.
ఉన్న ఇల్లు కూల్చుకుని ఇందిరమ్మ ఇల్లు కడితే అది కూడా కూల్చేస్తామని అంటున్నారు
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోమని ప్రభుత్వమే చెప్పింది.. రూ. లక్ష లోన్ కూడా వేశారు
మిగతా రూ. 3.5 లక్షలు బయట అప్పు తెచ్చి రూ. 3 వడ్డీ కడుతున్నాము
ఉన్న ఇల్లు కూల్చినందుకు ఇంకో ఇంటికి రూ.5000 కిరాయి కడుతున్నాము… https://t.co/xbv1Grb9Kj pic.twitter.com/zXgpQ6tW7a
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2026
Read Also :
Jagadish Reddy | పంటలను ఎండబెడుతున్న పాపం కాంగ్రెస్‌దే : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Project Cheetah | దేశంలో 8 నుంచి 52కు పెరిగిన చీతాల సంఖ్య.. ప్రాజెక్ట్ చీతా విజయవంతం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

