Krithi Shetty | కృతి శెట్టికి పుట్టినరోజు కానుక.. ‘జనవరి 12 విడుదల’లో దీపుగా బేబమ్మ
Krithi Shetty | కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ‘జనవరి 12 విడుదల’ చిత్రబృందం ఆమెకు ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సంక్రాంతి వినోదాత్మక చిత్రంలో కృతి శెట్టిని ‘దీపు’గా పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Krithi Shetty | కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ‘జనవరి 12 విడుదల’ చిత్రబృందం ఆమెకు ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సంక్రాంతి వినోదాత్మక చిత్రంలో కృతి శెట్టిని ‘దీపు’గా పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో కృతి శెట్టి సంప్రదాయ హాఫ్ శారీలో కనిపించారు. ఊదా, గులాబీ రంగులతో కూడిన దుస్తుల్లో ఆమె ఎంతో అందంగా దర్శనమిచ్చారు. చారిత్రక కట్టడం బ్యాక్ గ్రౌండ్లో కనిపిస్తుండగా.. చిరునవ్వుతో కృతి శెట్టి ఇచ్చిన పోజ్ పోస్టర్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. ఈ పోస్టర్ ద్వారా ఆమె పోషిస్తున్న పాత్ర చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుందని క్లారిటీ వచ్చింది.
‘జనవరి 12 విడుదల’ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. విభిన్నమైన టైటిల్‌తో ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇటీవల వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో రూపొందించిన హాస్యభరితమైన వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను ప్రకటించారు.ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కూడా సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ చిత్రాన్ని జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

