MBBS Student | ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఉపాధ్యాయుల సన్మానం
MBBS Student | నిర్మల్ జిల్లా కుభీర్ మండలానికి చెందిన విద్యార్థిని ఎంబీబీఎస్లో సీటు సాధించినందుకు పాఠశాల ఉపాధ్యాయులు, పోషకులు ఆమెను ఘనంగా సన్మానించారు.
కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలానికి చెందిన విద్యార్థిని ఎంబీబీఎస్ ( MBBS ) లో సీటు సాధించినందుకు పాఠశాల ఉపాధ్యాయులు, పోషకులు ఆమెను ఘనంగా సన్మానించారు. మండలంలోని గోడపూర్( Godapur ) గ్రామానికి చెందిన మోరే ఆనంద్ – సంగీత దంపతుల కూతురు అనుష్క ( Anuska ) ఇటీవల ఎంబీబీఎస్ సీటు సాధించింది.
ఈ సందర్భంగా సోమవారం గోడపూర్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, పోషకులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వైద్య సీటు సాధించిన అనుష్క తన చదువు పట్ల శ్రద్ధ, అంకిత భావం, కృషి పట్టుదల గురించి పాఠశాల విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు.
ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థిని అనుష్క మరెన్నో ఉన్నత చదువులు చదివి, వైద్యురాలిగా రాణించి సమాజానికి సేవలందించాలని, తల్లిదండ్రులకు, గురువులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. అనంతరం భగవద్గీత గ్రంథాన్ని బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరేష్ కుమార్, ఉపాధ్యాయులు ప్రవళిక, ప్రభ, అంగన్వాడీ టీచర్ సూర్యకళ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

