Anakapalli Teaser | త్రిణాధరావు నక్కిన మార్క్ స్టోరీతో ‘అనకాపల్లి’.. ఆకట్టుకుంటున్న టీజర్
Anakapalli Movie | యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు, నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫేమ్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'అనకాపల్లి' (Anakapalli).
Anakapalli Movie | యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు, నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫేమ్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా టీజర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. టీజర్ చూస్తుంటే.. ఈ సినిమా ఒక ఇంటెన్స్ పల్లెటూరి యాక్షన్ డ్రామాగా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ఇందులో విక్రమ్ సాహిదేవ్ తన సరికొత్త లుక్ మరియు పవర్ఫుల్ యాక్టింగ్తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. విక్రమ్తో పాటు సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప కీలక పాత్రల్లో నటించి సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు.
ఈ సినిమా వెనుక టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఉండటం విశేషం. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్ప్లే అందించగా, ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. నక్కిన నరేటివ్స్ మరియు భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి డావ్జాండ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. టీజర్ చివర్లో మేకర్స్ ప్రకటించినట్లుగా ఈ మూవీని ‘సమ్మర్ 2026’ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ చూసిన సినీ ప్రియులు ఈ సమ్మర్లో ఒక సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ పడబోతోందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

