Pakistani ships | ‘హర్మూజ్’ గుండా 20 పాక్ నౌకలకు అనుమతి.. శాంతికి సంకేతమన్న పాకిస్థాన్
Pakistani ships | పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ (Pakistan) కు చెందిన 20 నౌకలు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించేందుకు ఇరాన్ (Iran) అంగీకరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) స్వయంగా ప్రకటించారు.
Pakistani ships : పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ (Pakistan) కు చెందిన 20 నౌకలు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించేందుకు ఇరాన్ (Iran) అంగీకరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) స్వయంగా ప్రకటించారు. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ‘శాంతికి సంకేతం’ అని ఆయన అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రతిరోజూ రెండు పాకిస్థాన్ జెండా నౌకలు ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా వెళ్లేందుకు అనుమతి లభించింది.
పాకిస్థాన్ జెండాతో ఉన్న మరో 20 నౌకలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని, ఇది ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించే నిర్మాణాత్మక చర్య అని ఇషాక్ దార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం స్థిరత్వాన్ని పెంపొందించడానికి, ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటీవల ఇస్లామాబాద్, టెహ్రాన్ మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ఇషాక్ దార్ తన ఇరాన్ కౌంటర్పార్ట్ అబ్బాస్ అరాఘ్చితో ఫోన్లో మాట్లాడారు. శాశ్వత శాంతి కోసం చర్చలు, దౌత్యమే సరైన మార్గమని ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. అయితే హర్మూజ్ జలసంధిని తాము పూర్తిగా మూసివేయడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలకు సురక్షిత ప్రయాణానికి అనుమతి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి తెలిపారు. కానీ అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు మధ్యప్రాచ్య వివాదంలో పాలుపంచుకుంటున్న కొన్ని గల్ఫ్ దేశాల నౌకలకు మాత్రం ఈ మార్గంలో అనుమతి లేదన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

