Saudi Prince | లండన్ లగ్జరీ హోటల్లో సౌదీ రాకుమారుడు మృతి.. అతిగా డ్రగ్స్ సేవించడమే కారణం
Saudi Prince : లండన్‌లోని ఒక లగ్జరీ హోటల్లో సౌదీ రాకుమారుడు మృతిచెందాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 25న జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఆలస్యంగా వెలుగుచూశాయి.
Saudi Prince : లండన్‌లోని ఒక లగ్జరీ హోటల్లో సౌదీ రాకుమారుడు మృతిచెందాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 25న జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఆలస్యంగా వెలుగుచూశాయి. సౌదీ ప్రిన్స్ అయిన అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దలాజిజ్ బిన్ జలావి అల్ సౌద్ అనే 29 ఏళ్ల సౌదీ రాకుమారుడు యూకే, లండన్‌లోని కెన్సింగ్టన్లో ఉన్న మారియట్ అనే లగ్జరీ హోటల్లో మరణించాడు.
అతడు గత ఏడాది నవంబర్ 19న హోటల్ నుంచి సిగరెట్ కోసం బయటకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత అతడు వారంపాటు కనిపించలేదు. ఆ తర్వాత హోటల్ సిబ్బంది రూమ్ క్లీన్ చేయడం కోసం హెటల్ గదికి వెళ్లి చూడగా, అక్కడ బాత్ రూమ్‌లో ఫ్లోర్‌పై పడిపోయి కనిపించాడు. వెంటనే ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌కు తెలిపారు. వైద్య సిబ్బంది వచ్చి అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై లండన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అతడి రక్త నమూనాలు సేకరించారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. అతడు అపరిమితంగా డ్రగ్స్‌తోపాటు, ఆల్కహాల్, ఇతర ఔషధాలు తీసుకున్నట్లు తేలింది.
ఈ కారణంగా.. అధిక స్థాయి డ్రగ్స్, అన్నింటి కాంబినేషన్ కారణంగా కార్డియాక్ అరెస్టుకు గురై మరణించినట్లు నివేదిక తేల్చింది. ఈ విషయాన్ని ఇన్నర్ వెస్ట్ లండన్ కార్నర్ కోర్టుకు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో అతడి మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని, మరో వ్యక్తి ప్రమేయం లేదని కూడా దర్యాప్తు అధికారులు తేల్చారు. మరోవైపు సౌదీ రాకుమారుడి మృతిని సౌదీ రాయల్ కోర్టు కూడా అధికారికంగా ధృవీకరించింది. అతడికి రియాద్‌లోని వీఐపీ ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

