యాదాద్రి భువనగిరి : రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా (Quality Free Power) చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి మండలం అనంతారం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతారం, తాజ్పూర్, హనుమాపురం, మన్నెవారి పంపు ప్రాంతాలకు చెందిన రైతులు భారీగా తరలి వచ్చి ఆందోళన చేపట్టారు.
రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తామని,ప్రస్తుతం ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తోందని ఆరోపించారు. వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో సాగాలంటే 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా అవసరమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఉచిత విద్యుత్‌ను 12 గంటలకే పరిమితం చేసిందని ఆరోపించారు. అనంతరం రైతులు, ప్రజాప్రతినిధులు కలిసి విద్యుత్ శాఖ డీఈకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చిందం మల్లికార్జున్, పల్లెపాటి హరిబాబు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ గుమ్మడి సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ యువ నాయకుడు పోల ప్రవీణ్, వార్డు సభ్యుడు గుమ్ముల గణేష్, చిగురు పల్లి సోమయ్య , తాజ్పూర్ ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ, సామల చంద్రమోహన్, పల్లెపాటి నర్సింహ, కొత్తపెళ్లి కిషన్, రైతులు పాల్గొన్నారు.