న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనం సృష్టించే ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు భారతీయ సంతతికి చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ చాట్‌బాట్ సాయంతో ఓపెన్ ఏఐ వ్యవస్థలోని భద్రతా లోపాలను గుర్తించారు. ఓపెన్ ఏఐ నిర్వహిస్తున్న బగ్ బౌంటీ కార్యక్రమంలో పరిశోధకులు ఓపెన్ ఏఐ ఉద్యోగుల ఖాతాలకు, సంస్థకు చెందిన ప్రైవేట్ గిట్‌హబ్ వాతావరణానికి ప్రవేశించే మార్గాన్ని గుర్తించారు.
సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ హ్యాక్ట్రాన్ ఏఐకి చెందిన హర్ష్ జైస్వాల్, మోహన్ పెదపాటి, రాహుల్ మైనీ ఉన్నారు. ఈ మొత్తం ప్రయోగం 72 గంటల్లో పూర్తయ్యింది. ఈ పరీక్షల్లో ఏఐ టోకెన్ల కోసం వారు 3,000 డాలర్లు(సుమారు రూ. 2.5 లక్షలు) ఖర్చు చేసినట్లు సమాచారం. దీంతో లోపాలను సరిదిద్ది, ఈ ముగ్గురు పరిశోధకులకు 6,500 డాలర్లు(సుమారు రూ.5.5 లక్షలు) బగ్ బౌంటీగా చెల్లించింది. మోహన్ పెదపాటి ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ నూజివీడులో 2015-21 మధ్య బీటెక్ పూర్తి చేశారు.