షెఫాలీ శతక మోత ఫైనల్లో టీమిండియా
డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియాడ్‌లో మరోసారి పసిడి పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండో సెమీ ఫైనల్స్‌లో షెఫాలీ వర్మ (49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ శతక గర్జన చేయగా టీమిండియా 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
నిషిన్ : డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియాడ్‌లో మరోసారి పసిడి పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండో సెమీ ఫైనల్స్‌లో షెఫాలీ వర్మ (49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ శతక గర్జన చేయగా టీమిండియా 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. షెఫాలీకి తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (40), స్మృతి మంధాన (37) ధనాధన్ ఆటతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లకు 4 వికెట్ల నష్టపోయి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.
లక్ష్యఛేదనలో బంగ్లా 15.4 ఓవర్లకు 81 రన్స్‌కే కుప్పకూలింది. ఓపెనర్ దిలారా అక్తర్ (27) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3/7), శ్రీచరణి (2/7) స్పిన్ మాయకు తోడు నందని శర్మ (3/25) తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. మరో సెమీస్‌లో శ్రీలంక.. పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్ చేరింది. మంగళ వారం ఇదే వేదికలో భారత్, శ్రీలంక ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
1 టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మంధాన (4,788) సుజీ బేట్స్ (4,758) ను అధిగమించి ఈ ఫార్మాట్లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

