Commonwealth Games : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో భారత స్విమ్మర్లు అదరగొడుతున్నారు. పురుషుల పారా 100 మీటర్ల ఫ్రీ స్టయిల్ ఎస్ 13 విభాగంలో కార్తిక్ బుడిగిన (Karthik Budigina), అలీ ఇమామ్(Ali Imam)లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ పోటీలో సత్తా చాటిన శ్రీహరి నటరాజ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. అయితే.. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను (Mirabai Chanu) మూడోసారి పసిడి పట్టేస్తుందనుంటే.. 90 కిలోల విభాగంలో 100 శాతం తన సామర్ధ్యాన్ని వినియోగించలేని పేర్కొంది.
తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడుతున్న కార్తిక్ బుడిగిన, అలీ ఇమామ్‌లో ఈత కొలనులో మెరిశారు. చూపు సరిగా లేని ఇద్దరూ పారా స్విమ్మింగ్ పోటీల్లో ఫైనల్ చేరి పతకానికి అడుగుదూరంలో నిలిచారు. కార్తిక్ 57.10 సెకన్లలో స్విమ్ పూర్తి చేసి మూడో స్థానంలో నిలవగా.. ఎస్ 12 ఈవెంట్లో 1:05.32 టైమింగ్‌తో అలీ ఫైనల్ బెర్తు సాధించాడు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ పోటీలో ఫైనల్ బెర్తు కోసంశ్రీహరి నటరాజ్ శనివారం ఉదయం 12:30గంటలకు ఈతకు సిద్ధమవ్వనున్నాడు.
|| 𝐂𝐨𝐦𝐦𝐨𝐧𝐰𝐞𝐚𝐥𝐭𝐡 𝐆𝐚𝐦𝐞𝐬 𝟐𝟎𝟐𝟔 ||
भारत के आर.वी.वी.बी.के. बुडिगिना और अली इमाम ने पुरुषों की एस13 100 मीटर फ्रीस्टाइल की पहली हीट में क्रमशः 57.10 सेकंड और 1:05.32 मिनट का समय दर्ज किया।
बुडिगिना तीसरे और अली इमाम आठवें स्थान पर रहे। दोनों ने फाइनल के लिए… pic.twitter.com/lcM7g2459R
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) July 24, 2026
India makes it count once again! 💯🔥
Srihari Natraj qualifies for the semifinals after finishing 5th in the Men’s 50m Backstroke heats 🏊♂️💪
One step away from a medal? 👀🏅#CommonwealthGames #Glasgow2026 #Swimming pic.twitter.com/w5eKeYUsPE
— Sportskeeda (@Sportskeeda) July 24, 2026
ఒలింపిక్ విజేత మీరాబాయి చాను మాత్రం తాను 90 కిలోల విభాగంలో పూర్తి స్థాయిలో పోటీపడనని తేల్చి చెప్పింది. జపాన్ వేదికగా త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలే లక్ష్యంగా పెట్టుకున్న తాను కామన్వెల్త్లో 100 శాతం తన శక్తిని ఉపయోగించబోనని స్పష్టం చేసిందీ పవర్ లిఫ్టర్. ఎందుకంటే.. గ్లాస్గోలో తను 48 కిలోల విభాగంలో తలపడుతోంది. ఆసియా క్రీడల్లో 49 కిలోల కేటగిరీలో బరువులు ఎత్తాలనుకుంటున్ను చాను కామన్వెల్త్ పోటీల్లో అనవసరంగా రిస్క్ వద్దనే ఉద్దేశంతో ఉంది.
