న్యూశాయంపేట, ఏప్రిల్ 7: శ్రీ సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని 49 వ డివిజన్ రెవెన్యూ కాలనీలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం జరిగిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కల్యాణంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వాముల కల్యాణం తిలకించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానస రాంప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్, నాయిని లక్ష్మా రెడ్డి, సీనియర్ నాయకులు పల్లె రాహుల్ రెడ్డి, నాగపరి కరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Cinnamon | దాల్చిన చెక్కతో ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్యాలకు దీన్ని ఎలా వాడాలంటే..?
MS Dhoni | ధోనీ రిటైర్మెంట్పై స్పందించిన సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్..!
Priyanka Chopra | టాలీవుడ్ హీరోలపై ఫోకస్ పెట్టిన ప్రియాంక చోప్రా.. నిన్న మహేష్‌తో, ఇప్పుడు..