Priyanka Chopra | గ్లోబల్ భామ ప్రియాంక చోప్రా..నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న తర్వాత ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలే చేసింది. బాలీవుడ్ చిత్రాలు కూడా చేసింది తక్కువే. ఇండియాకి కూడా ఏదో అడపాదడపా వచ్చి వెళుతుంది. అయితే హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రాని రాజమౌళి తన సినిమా కోసం ఇండియాకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో ప్రియాంక చోప్రాని ఓ ముఖ్య పాత్ర కోసం రాజమౌళి ఎంపిక చేశాడు. ఇండియన్ రూట్స్ ఉన్న ప్రియాంక చోప్రాకి హాలీవుడ్‌లోను క్రేజ్ ఉంది. ఇది తన సినిమాకి ఎంతో ఉపయోగపడుతుందని భావించిన జక్కన్న ఆమెని తన సినిమా కోసం తీసుకున్నాడు. ఇక ప్రియాంక ఇప్పటికే షూటింగ్లో పాల్గొనడం, తన అనుభవాలని సోషల్ మీడియాలో పంచుకోవడం కూడా మనం చూశాం.
అయితే ప్రియాంక చోప్రా ఇప్పుడు మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇటీవలే పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ త్వరలో అట్లీతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.ఇప్పటికే కథ కూడా ఓకే అయిపోయింది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుందని సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు తన సోషల్ మీడియాలో షాకింగ్ సర్ ప్రైజ్ కోసం ప్రిపేర్ అయి ఉండండి. ఏప్రిల్ 8న రానుంది అని పోస్ట్ చేసాడు. అంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో ఆ రోజు అల్లు అర్జున్ – అట్లీ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.
దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో భారీ కమర్షియల్ సినిమా అల్లు అర్జున్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రాని కథానాయికగా తీసుకోబోతున్నారట. ప్రియాంక అడిగినంత రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ చూసుకొని ప్రియాంక చోప్రా అల్లు అర్జున్ సినిమాకి ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కాని ఇదే నిజమైతే మాత్రం బన్నీ సినిమాకి కూడా ఫుల్ మైలేజ్ రావడం ఖాయమని తెలుస్తుంది. ఏప్రిల్ 8న బన్నీ సినిమాలకి సంబంధించి క్లారిటీ అయితే వస్తుంది.