MS Dhoni | ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడోసారి ఓటమిపాలైంది. 25 పరుగుల తేడాతో సీఎస్కేని ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించే ఎక్కువగా చర్చ సాగుతున్నది. 43 ఏల్ల ధోని ఢిల్లీతో జరిగిన 11వ ఓవర్లో ఏడో నంబర్‌కు బ్యాటింగ్‌కు వచ్చాడు. చెన్నై 74 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి విజయానికి 56 బంతుల్లో 110 పరుగులు చేయాల్సింది. అయితే, మహి 26 బంతుల్లో కేవలం 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. దాంతో ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఆ జట్టు హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్లో ధోనీ ఇప్పటికే బలంగానే ఆడుతున్నాడని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శనివారం చెపాక్ స్టేడియంలో ధోనీ తల్లిదండ్రులు కనిపించడంతో రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
రిటైర్మెంట్ వ్యాఖ్యలను ఫ్లెమింగ్ సైతం ఖండించాడు. ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకవడం లేదని.. ఇప్పటికీ ధోనీ అద్భుతుంగా ఆడుతున్నాడని.. అతని భవిష్యత్‌పై మాట్లాడడం మానేశామని పేర్కొన్నారు. ఇంతకు ముందు ధోనీ తొమ్మిదో నంబర్లో పంపడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. శనివారం మ్యాచ్‌లో ఏడో నెంబర్లో బ్యాటింగ్‌కు రాగా.. గతంలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. వరుసగా మూడో ఓటమి నుంచి గట్టెక్కించ లేకపోయాడు. ధోనీని ఫ్లెమింగ్ సమర్థిస్తూ.. ఆ సమయంలో బ్యాటింగ్ చేయడం నిజంగా కష్టమని తెలిపారు. ధోనీ అభిరుచిని ప్రదర్శించారు. క్రీజులోకి వచ్చేసరికి బంతి కాస్త స్లోగా వస్తోందని అనుకుంటున్నానని.. ఫస్ట్ హాఫ్‌లో బావుంటుందన్నారు. విజయ్ శంకర్ తన ఇన్నింగ్స్ సమయంలో టైమింగ్‌ని తిరిగి పొందేందుకేనని.. అక్కడ ఆడటం కచ్చితంగా కష్టమేనని.. ప్రయత్నించినప్పటికీ మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయిందన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ బ్యాట్స్‌మెన్ లోకేష్ రాహుల్ చెన్నైకి చెందిన ఎడమచేతి వాటం మణికట్టు స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను లయలోకి రానివ్వలేదని.. దాంతోనే తమ జట్టు విజయంలో పెద్ద పాత్ర పోషించిందని ఢిల్లీ ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ తెలిపాడు.