ఖిలావరంగల్, మార్చి 06: వరంగల్ రైల్వే గూడ్సు షెడ్డులో హమాలీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని(Medical camp) డీఏవో అనురాధ ప్రారంభించారు. హమాలీ కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కోరమండల్, ఎన్ఎస్ఆర్, అపోలో, ఎలైట్, కాకతీయ కంటి హాస్పిటల్ నిర్వహకులను ఈ సందర్భంగా డీఏవో అభినందించారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షుడు కక్కె సారయ్యతోపాటు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Road accident | వంకాయ గూడెం వద్ద ఇన్నోవా కారు బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Satish Kumar | కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత : వొడితల సతీష్ కుమార్