Farmer | రోజూ తిరుగుడైతుంది.. చైర్మన్ సరిగ్గా లేడు. ఇక్కడ ట్యాప్ సరిగ్గా లేదు. అంత శుభ్రంగా లేదని తొర్రూరు మార్కెట్లో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సదరు రైతు మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న, వడ్లు కోసి 30 రోజులవుతుంది. రోజూ తిరుగుడు పెట్రోల్ బొక్క. రోజూ పొద్దు మాపున 5 కిలో మీటర్ల నుంచి వచ్చుడు.. పోవుడు అవుతుందన్నాడు..
పరగడుపున ఇక్కడ కూర్చొని టిఫిన్లు, నీళ్లను కూడా కొనుక్కోవాల్సి వస్తుంది.. టిఫిన్ కొనుక్కునుడు.. మధ్యాహ్నం అన్నం కొనుక్కొచ్చుకునుడు. కాంగ్రెస్ వచ్చినంక మా పరిస్థితి గోరంగ ఉంది.. వడ్లు పోసి 15 రోజులైంది. ఆ వడ్లు అట్లనే తడుస్తున్నయ్. నాకు 5 ఎకరాలున్నయ్. రైతు భరోసా అన్నరు.. అదేమీ లేదు. ఎకరానికి రైతు భరోసా వేసి మిగిలినవి వేయ్యనే లేదన్నాడు.
కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి రైతుల పరిస్థితి ఘోరంగా మారింది. నెల రోజుల నుండి మొక్కలు, వడ్లు మార్కెట్లోనే ఉన్నాయి.. ఇప్పటికి ప్రభుత్వం కొనట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వర్షం పడితే పంట పాడైపోతుందని భయం భయంగా బ్రతుకుతున్నాం. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నట్లు ఉంటది అనుకోని ఓటేశాం.. కానీ కాంగ్రెస్కు ఓటేస్తే ఇంత గోస పడతామని అనుకోలేదన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే కంటే చెప్పుతో కొట్టుకోవడం నయమని అన్నాడు.
కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి రైతుల పరిస్థితి ఘోరంగా మారింది
నెల రోజుల నుండి మొక్కలు, వడ్లు మార్కెట్లోనే ఉన్నాయి.. ఇప్పటికి ప్రభుత్వం కొనట్లేదు
వర్షం పడితే పంట పాడైపోతుందని భయం భయంగా బ్రతుకుతున్నాం
రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నట్లు ఉంటది అనుకోని ఓటేశాం.. కానీ ఇంత గోస పడతామని… https://t.co/uYfl2jeL3H pic.twitter.com/w4C4zl4mEn
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2026