Rice palnting| బయ్యారం, ఆగస్టు 13 : అది నిత్యం వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించే ఆర్అండ్బీ రోడ్డు. అయితే వర్షం పడితే చాలు ఈ రోడ్డు గుంతలు పడి బురదమయంగా మారుతుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో బురదమయంగా మారిపోయింది. అద్వానంగా మారిన ఈ రహదారి పరిస్థితి తెలియజేసేందుకు స్థానికులు వినూత్న శైలిలో నిరసన తెలియజేశారు. బురదమయంగా ఉన్న రోడ్డుపై నాటు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
బయ్యారం మండల కేంద్రంలోని వెంకట్రాంపురం రహదారిలో ఉన్న రుద్రమదేవి వీధి వద్ద ఆర్అండ్బీ రహదారి గుంతలు పడి బురదమయంగా మారింది. బురదమయమైన రహదారితో ఇబ్బంది పడుతున్న స్థానికులు రహదారికి అడ్డంగా కర్రలను వేసి రాకపోకలు నిలిపివేశారు. అంతేకాకుండా బురదమయంగా ఉన్న రహదారిపైన నాటు వేసి తమ నిరసన తెలిపారు.
గత కొన్ని రోజులుగా రహదారి సరిగ్గా లేక మండలంలోని సుమారు 50 గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయినా గ్రామపంచాయతీ సిబ్బంది కానీ ఆర్అండ్బీ అధికారులు గానీ పట్టించుకోకపోవడం పట్ల ప్రయాణికులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేయాలని కోరుతున్నారు.
Heavy Rains | అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సై కీలక ఆదేశాలు
Road Repair | ఆదమరిస్తే అంతే.. సారూ ఈ రోడ్లకు జర మరమ్మతులు చేయించండి
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు అవస్థలు