Purushottamaya Gudem Bridge | గత సంవత్సరం అకాల వర్షాలకు ఆఖరి వాగు వరద ప్రవాహంతో పురుషోత్తమాయ గూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జి దెబ్బ తినడంతో బ్రిడ్జి పైనుంచి రాకపోకలను కొంతకాలం నిలిపివేయడం జరిగింది. అధికారులు బ్రిడ్జిని మరోసారి పరిశీలించి తిరిగి వాహనాల రాకపోకలను ప్రారంభించారు.
ఇదే క్రమంలో సోషల్ మీడియాలో శనివారం పురుషోత్తమాయ గూడెం బ్రిడ్జి మరోసారి కుంగిందని వార్త వైరల్ అయింది. దీంతో వాహనదారులు బ్రిడ్జిపై నుంచి రాకపోకలను కొనసాగించాలంటే భయపడుతున్నారు. ఇంతకు పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి సురక్షితమేనా..? డేంజరా..? అని అధికారులు స్పష్టత ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్