తొర్రూరు : మహబూబాబాద్(Mahabubabad) జిల్లా తొర్రూరు మండలంలో మంగళవారం ఉదయం మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు(Sarpanch Forum president )శీలం లింగన్న గౌడ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సర్పంచులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో సర్పంచుల ఫోరం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో, తొర్రూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లింగన్న గౌడ్ ముట్టడికి బయలుదేరుతున్న సమయంలోనే పోలీసులు ముందస్తు అరెస్టు చేసి, అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పెండింగ్‌లో పెట్టడం వల్ల సర్పంచులందరూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న న్యాయపరమైన కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.