న్యూఢిల్లీ, మార్చి 5: చైనాకు చెందిన ఈవీల తయారీ సంస్థ బీవైడీ..మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. బీవైడీ గ్రేట్ టంగ్ పేరుతో విడుదల చేసిన ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 950 కిలోమీటర్లు ప్రయాణించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న కార్లలో ఇదే అత్యధిక మైలేజీ ఇచ్చే కారు కావడం విశేషం. ధర ఇతర వివరాలు సంస్థ వెల్లడించలేదు. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు ఇతర వివరాలు సంస్థ వెల్లడించలేదు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది.