Union Govt | త్వరలో టూవీలర్ అంబులెన్స్‌లు.. కొత్త ప్రతిపాదనతో కేంద్రం నోటిఫికేషన్..!
Union Govt | ద్విచక్ర వాహన అంబులెన్సుల (Two Wheeler Ambulances) కు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) నిర్ణయించింది. ఇందుకోసం 'కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989' కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు, రవాణాశాఖ ముసాయిదా నోటిఫికేషన్ (Draft Notification) జారీచేసింది.
Union Govt : ద్విచక్ర వాహన అంబులెన్సుల (Two Wheeler Ambulances) కు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) నిర్ణయించింది. ఇందుకోసం ‘కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989’ కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు, రవాణాశాఖ ముసాయిదా నోటిఫికేషన్ (Draft Notification) జారీచేసింది. గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లోని పల్లెలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇప్పటివరకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనల పరిధిలో ద్విచక్ర అంబులెన్సులు లేవు. దానివల్ల వాటి రూపురేఖలు, నిర్వహణ, రోగులను హ్యాండ్లింగ్ చేసే విధానం, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ తనిఖీలకు అవసరమైన నిబంధనలు ఖరారు చేయడానికి వీల్లేకుండా పోయింది. నిబంధనలను సవరించడంవల్ల ఈ అంబులెన్సులు ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. ఎల్2 కేటగిరీ ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా ఉపయోగించడానికి అనుమతిస్తారు.
రాష్ట్రాలు నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఇవి సేవలు అందించడానికి వీలుంటుంది. ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉన్నవారు 30 రోజుల్లోగా కేంద్ర రహదారులు, రవాణాశాఖకు పంపాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను జారీచేయనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

