నర్సింహులపేట, జూన్ 27: రోజూ వేలాది వాహనాలు రోజు వేలాది వాహనాలు ప్రయాణించే మార్గమిది.. పేరుకు జాతీయ రహదారి.. అయినా మట్టి రోడ్డు కంటే అధ్వానంగా గుంతలు. నిత్యం ప్రమాదాల జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటంలేదు. నర్సింహులపేట (Narsimhulapeta) మండల పరిధిలోని వరంగల్-ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే జాతీయరహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళలో వాహనాలు గుంతలో పడి ప్రయాణికులు తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంటున్నాయి.
దీంతో జాతీయ దహదారి పక్కనే ఉన్న గోపా తండాకు చెందిన ఓ మహిళ గుంత వద్ద ముళ్లకంపను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఓ ప్రయాణికుడు గుంతలో పడి గాయాలు కావడంతో ఆ మహిళ మరో ప్రమాదం జరగకుండా చెప్పారు. నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనాలు పాడవుతున్నాయని వేలు ఖర్చుచేసి బాగు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చివేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.