Jhansi Reddy | పెద్దవంగర, జూన్ 13 : పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, టీపీసీసీ నేత ఝాన్నీ రెడ్డిని ప్రజలు నిలదీశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్య తండాలో నిర్వహించిన పల్లె బాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు తమ సమస్యలు విన్నవించుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. కానీ వాళ్ల సమస్యలు వినకుండా ఆమె అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పల్లె బాటలో భాగంగా మోత్యతండా గ్రామాన్ని సందర్శించిన ఝాన్సీ రెడ్డిని గ్రామస్తులు అడుగు అడుగునా సమస్యలతో నిలదీశారు. తండాలో తాగునీటి సమస్య ఉందని, విద్యుత్ సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వ పథకాల అమలులో తలెత్తుతున్న లోపాలపై గ్రామస్తులు ఝాన్సీ రెడ్డిని నిలదీశారు. అయితే ఈ ప్రశ్నలు ఎదురయ్యే సరికి ఆమె స్పందించకుండా అక్కడి నుంచి వెళ్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
“ఇలా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వెళ్లిపోతే నాయకుల అవసరం ఏమిటి?” అంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల కష్టాలు వినడం బాధ్యతగా ఉండాల్సిన సమయంలో, ఝాన్సీ రెడ్డి ప్రవర్తన పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజా సమస్యలు వినకపోతే పల్లె బాట కార్యక్రమం ఎందుకు ?
అత్తా కోడళ్లపై తిరగబడుతున్న పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు
పాలకుర్తి నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళినా అత్త ఝాన్సీ రెడ్డి, కోడలు యశస్విని రెడ్డిని తరిమికొడుతున్న ప్రజలు
పల్లె బాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డిని… https://t.co/yHaienK4Og pic.twitter.com/4ys6vAHZDm
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025