మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలంమాధవపురం గ్రామంలో ఇస్లావత్ తండా, జర్పుల తండా, మాధవపురం,తూర్పు తండా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందజేస్తున్నారన్నారు.
పింఛన్ రానివారు అధైర్యపడవద్దని అర్హులైన వారందరికిపెన్షన్స్ వస్తాయన్నారు. దరఖాస్తు చేసుకొని వారు ఉంటే చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మౌనిక, జెడ్పీటీసీ ప్రియాంక, పీఏసీఎస్ చైర్మన్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.